ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘ లవ్ స్టొరీ ‘ చిత్ర చిత్రీకరణలో ‘కింగ్’ నాగార్జునతో జతకలిసిన నయనతార. నాగార్జునతో నయనతారకి ఇది రెండవ చిత్రం, వీరిద్దరూ ఇదివరకే ‘బాస్’ చిత్రంలో కలిసి నటించారు. ” ఈ రోజు నుంచి నయనతార ‘లవ్ స్టొరీ’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారని, మళ్ళీ నయనతార తన టీం తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని” ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన చందన్ రెడ్డి గారే స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో మీరా చోప్రా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఇండియాకి మొదటి సారిగా వచ్చే అమెరికన్ ఎన్నారైగా నాగార్జున కనిపించనున్నారు మరియు ఈ చిత్రంలో నాగార్జున ఇప్పటివరకు కనిపించని సరికొత్త స్టైలిష్ లుక్ తో కనిపించనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం త్వరలోనే అమెరికా వెళ్లనున్నారు. కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి మరియు ఆయన తనయుడు చందన్ రెడ్డితో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు దశరథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.