విడుదల తేది ఖరారు అయిన “నందీశ్వరుడు”

విడుదల తేది ఖరారు అయిన “నందీశ్వరుడు”

Published on Jan 2, 2012 9:16 PM IST

ఎట్టకేలకు నందమూరి తారకరత్న రాబోయే చిత్రం “నందీశ్వరుడు ” విడుదల తేది ఖరారు అయ్యింది ఈ చిత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. శ్రీనివాస్ యరజల దర్శకత్వం వహించిన ఈ చిత్రం కన్నడ చిత్రం “డెడ్లి సోమ” చిత్రం ఆధారంగా తీసారు. తారక రత్న ,షీనా,జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గంగాధర్ రెడ్డి మరియు రమేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 23 న విడుదల అవ్వాల్సి ఉండగా కాలేదు ఇప్పుడు ఈ చిత్రాన్ని జనవరి 14 న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు