మార్చ్ లో నీకు నాకు డాష్ డాష్

మార్చ్ లో నీకు నాకు డాష్ డాష్

Published on Jan 25, 2012 11:46 PM IST

ఆసక్తి కరమయిన పేరుతో రాబోతున్న చిత్రం ” నీకు నాకు డాష్ డాష్” మార్చ్ చివరి వారం లో విడుదల కి సిద్దమయ్యింది. ఈ చిత్రానికి దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం లో తారాగణం అంతా కొత్తవారే. అందరిని కొత్తవారినే పెట్టి సినిమా తీస్తే విజయం దక్కుతుంది అని తేజ ఆశిస్తున్నారు చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ . భవ్య సిమెంట్స్ ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కొత్త సంగీత దర్శకుడు పరిచయం కాబోతున్నారు. నటినటులను స్టార్ హంట్ ద్వారా ఎంపిక చేసుకున్నారు చిత్రం మొత్తం హైదరాబాద్ మరియు విశాఖపట్నం లో చిత్రీకరించారు.

తాజా వార్తలు