త్వరలో మొదలు కానున్న మంచు విష్ణు చిత్రం

త్వరలో మొదలు కానున్న మంచు విష్ణు చిత్రం

Published on Dec 23, 2011 3:02 PM IST

చాలా రోజుల నుండి విజయం కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు పూర్తిగా కామెడి మీదే దృష్టి పెట్టినట్టు ఉన్నారు.సీమ శాస్ర్తి చిత్ర దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం లో నటిస్తున్నారు. హన్సిక మోత్వాని ఈ చిత్రం లో కథానాయికగా నటిస్తుంది. జనవరి 5 న ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. గత కొద్ది వారాలుగా విష్ణు యు.ఎస్ లో తన భార్య తో ఉంటున్నారు. మంచు విరానికా కవలలకు జన్మనిచ్చారు. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని అందిస్తున్నారు. “వస్తాడు నా రాజు” పరాజయం తరువాత విష్ణు చిత్రాలకి దూరంగా ఉన్నారు. సి.సి.ఎల్ తెలుగు వార్రియర్స్ టీం ని కూడా ఇంకొక కంపెనీ సొంతం చేసుకున్నట్టు పుకారు ఉంది. 2012 సంవత్సరం విష్ణు కి కలిసి వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు