కొత్త యాస మాట్లడబోతున్న లక్ష్మి మంచు

కొత్త యాస మాట్లడబోతున్న లక్ష్మి మంచు

Published on Apr 10, 2012 8:01 PM IST

నిర్మాత, యాంకర్, మంచి ప్రతిభ గల నటిగా విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మి ప్రసన్న. ఆమె ప్రస్తుతం నూతన చిత్రం “గుండెల్లో గోదారి”. ఈ చిత్రంలో గోదావరి యాసలో ఈ నటి మాట్లడబోతున్నారు. ఇదే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతుంది. ప్రేమ కథా చిత్రంగా ఉండబోతున్న ఈ చిత్రం 1986 గోదావరి వరదల నేఫధ్యంలో సాగే చిత్రం. ఆది,లక్ష్మి మంచు ,సందీప్ కిషన్ మరియు తాప్సీ లు ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం రాజమండ్రి పరిసరాలలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల అవ్వడానికి సిద్దమయ్యింది.

తాజా వార్తలు