కాజల్ ప్రిన్స్ మహేష్ బాబుతో బిజినెస్ మ్యాన్ చిత్రంలో రొమాన్సు చేస్తున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్ర డబ్బింగ్ శబ్దాలయ స్టూడియోలో జరుగుతుంది. ఈ చిత్రం లో తన పాత్ర కోసం కాజల్ తనే డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేసింది. తన పాత్రకి డబ్బింగ్ డబ్బింగ్ చెప్పాలని ఆసక్తి చూపడంతో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. డబ్బింగ్ బాగా వస్తే తనతోనే చెప్పించడం జరుగుతుంది. ఇంతకుముందే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సవిత రెడ్డి తో డబ్బింగ్ చెప్పించారు. జనవరి 11న విడుదలవుతున్న ఈ చిత్ర
ఆడియో ఈ నెల 22 న విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు.