విక్రమ్ తో కలిసి నటించనున్న జీవా

విక్రమ్ తో కలిసి నటించనున్న జీవా

Published on Apr 11, 2012 3:31 AM IST

విక్రమ్ హిందీలో చెయ్యబోతున్న చిత్రం “డేవిడ్” రోజు రోజుకి ప్రాదాన్యత సంతరించుకుంటుంది.. తాజాగా ఈ చిత్ర తారాగణంలో జీవ(రంగం మరియు స్నేహితుడు ఫేం) ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. డేవిడ్ గోవాలో సాగే గ్యాంగ్ స్టర్ నేఫధ్యంలో సాగే కథగా ఉండబోతుంది. రావన్ చిత్రంతో హిందీలో ప్రవేశించిన విక్రమ్ కి ఇది రెండవ చిత్రం. సైతాన్ దర్శకుడు బిజోయ్ నంబియార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ మరియు తమిళం లో చిత్రీకరిస్తారు తెలుగులో డబ్ చేస్తారు. జీవ తెలుగు మరియు తమిళ వెర్షన్ల లో కనిపించబోతున్నారు. టబు,ఇషా శ్రావణి మరియు నీల్ నితీష్ దేశ్ముఖ్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు