చిత్ర పరిశ్రమ మీద ఐ పి ఎల్ ప్రభావం

చిత్ర పరిశ్రమ మీద ఐ పి ఎల్ ప్రభావం

Published on Apr 12, 2012 6:29 PM IST

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఐ పి ఎల్ ఊపులో చిక్కుకొని ఉంది. సిని ప్రముఖులు పలువురు ఐ పి ఎల్ లో వారికి నచ్చిన జట్టుల వివరాలను ఫాలో అవుతున్నారు. విక్టరీ వెంకటేష్ మరియు రాజమౌళి విశాఖపట్టణంలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడటానికి వెళ్ళారు. సిద్దార్థ్ మరియు అఖిల్ అక్కినేని వారి ఆసక్తిని ట్విట్టర్ లో ప్రదర్శిస్తున్నారు.

“ఆర్ సి బి వెర్సస్ సి ఎస్ కే కేక మ్యాచ్ చెన్నై కుర్రాళ్ళు అద్బుతంగా ఆడుతున్నారు ఈ మ్యాచ్ గెలుస్తారు అని అనుకుంటున్నా” అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. ఈ ఆట చిత్ర పరిశ్రమ మీద ప్రభావం చూపిస్తుందని తెలుస్తుంది పెద్ద పెద్ద నిర్మాతలు వారి చిత్రాలను సెమి ఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్ సమయాలలో విడుదల చెయ్యట్లేదు. సెమి ఫైనల్ మరియు ఫైనల్ సమయాల్లో చిత్రాన్ని విడుదల చేసి ప్రారంభ వసూళ్లను తక్కువగా పొందాలని అనుకోవట్లేదు అని ప్రముఖ నిర్మాత తెలిపారు. ఎన్టీయార్ మాత్రం ఈ సీజన్లో లోనే దమ్ము చిత్రాన్ని విడుదల చేస్తున్నారు ఈ చిత్రం ఏప్రిల్ 27 విడుదల కానుంది.

తాజా వార్తలు