మంచి చిత్రాలు చెయ్యాలని ఎప్పుడు అనుకోలేదు -సంపత్ నంది

మంచి చిత్రాలు చెయ్యాలని ఎప్పుడు అనుకోలేదు -సంపత్ నంది

Published on Apr 9, 2012 8:46 PM IST

“రచ్చ” చిత్ర దర్శకుడు సంపత్ నంది తాను ఇంతవరకు ఒక మంచి చిత్రం చెయ్యలేదని అన్నారు. ఆశ్చర్యపోకండి వివరాల్లోకి వెళ్తే తానెప్పుడు మంచి చిత్రం చెయ్యాలని అనుకోలేదు అని సంపత్ నంది పేర్కొన్నారు . ఎప్పుడు ఒక కమర్షియల్ చిత్రం కోసమే ప్రయత్నిస్తానని అన్నారు. “నేనెప్పుడు మంచి చిత్రాలు చెయ్యాలని అనుకోలేదు నా వరకు మాస్ చిత్రాలతో జనాన్ని ఆకట్టుకోవాలి అదే నేను రచ్చ చిత్రంతో చేశాను”. ఈరోజుతో పడవ తరగతి పరీక్షలు పూర్తవడంతో రచ్చ ఈ వారం మరింత బలపడనుంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

తాజా వార్తలు