మిరపకాయ్ కి సీక్వెల్ తీస్తానంటున్న హరీష్ శంకర్

మిరపకాయ్ కి సీక్వెల్ తీస్తానంటున్న హరీష్ శంకర్

Published on Jan 1, 2012 10:06 AM IST

2011 సంవత్సరంలో వచ్చిన విజయవంతమైన సినిమాలో ‘మిరపకాయ్’ ఒకటి. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నాడు. దీని కోసం ఇప్పటికే స్క్రిప్ట్ ప్రారంబించిన హరీష్ ఆ స్క్రిప్ట్ రవితేజకి వినిపించబోతున్నాడు. గతంలో వీరిద్దరు కలిసి ‘షాక్’ మరియు ‘మిరపకాయ్’ చిత్రాలకు పనిచేసారు. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్-శృతి హాసన్ జంటగా నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో బిజీగా ఉన్నారు. హైదరాబాదులో తరువాతి షెడ్యుల్ జరుపుకోబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు