అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Published on Apr 8, 2012 11:00 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేరుని ఏర్పరుచుకున్న నటుడు అల్లు అర్జున్. కష్టపడే తత్వం, అబ్బురపరిచే డాన్స్, ఆసక్తికరమయిన సినిమాలను ఎంచుకోవటం అల్లు అర్జున్ ని తెలుగు పరిశ్రమలో అగ్ర తారగా నిలబెట్టింది. తన సిని జీవితాన్ని చిరంజీవి “డాడీ” చిత్రం లో చిన్న పాత్రతో మొదలు పెట్టిన ఈ నటుడు రాఘవేంద్ర రావు “గంగోత్రి” చిత్రంతో తెర మీదకు హీరోగా పరిచయమయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో “ఆర్య” చిత్రంతో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు, దేశముదురు,పరుగు,బన్నీ వంటి పలు హిట్ చిత్రాలలో నటించారు. వేదం చిత్రంలో కేబుల్ రాజు పాత్ర అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కొన్ని రోజులుగా హిట్ లేని ఈ నటుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “జులాయి” చిత్రంతో తిరిగి విజయపథం లోకి రావాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం జూన్ లో విడుదల అవుతుంది. ఈరోజు ఈ నటుడు పుట్టిన రోజు సందర్భంగా 123 తెలుగు.కాం బృందం తరుపున ఆయనకి మా శుభాకాంక్షలు

తాజా వార్తలు