తమన్నా అంటే నాకు ప్రేమంట : రామ్

కుటుంబ సభ్యులందరితో కలిసి చూడతగ్గ సినిమాలు తీయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్రవంతి మూవీస్ సంస్థ బ్యానర్ పై స్రవంతి కిషోర్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో విడుదల చేసారు. ఈ వేడుకకు రామ్, తమన్నా, కరుణాకరన్, స్రవంతి రవికిషోర్, దాసరి నారాయణరావు, రవితేజ, కాజల్ అగర్వాల్, శ్రేయ, బొమ్మరిల్లు భాస్కర్, శ్రీను వైట్ల, కందిరీగ శ్రీనివాస్, శ్యాం ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు విచ్చేసారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ తన ఫ్యాన్స్ ఆనందం కోసమే, వాళ్ళకు నచ్చే సినిమాలు చేస్తానని, ఫ్యాన్స్ లేనిదే తను లేనని అన్నాడు. ఈ వేడుకలో సరదాగా జరిగిన కార్యక్రమంలో తమన్నా అంటే తనకు ఎంతో ప్రేమో ఈ సినిమాలో చూడబోతున్నారని అన్నాడు. తమన్నా మాట్లాడుతూ స్రవంతి మూవీస్ సంస్థలో రెడీ సినిమాలో చిన్న పాత్ర పోషించాను. ఆ తరువాత ఈ సంస్థలో ఫుల్ లెంగ్త్ పాత్రలో చేయాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది అన్నారు. ఈ చిత్ర ఆడియోని రవితేజ విడుదల చేసి మొదటి సీడీ అల్లు అరవింద్ కి ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ వేడుకకి విచ్చేసిన అతిధులందరూ ఎందుకంటే ప్రేమంట చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకున్నారు.

Exit mobile version