మార్చ్ 2న విడుదల కానున్న “ఏకవీర”

మార్చ్ 2న విడుదల కానున్న “ఏకవీర”

Published on Feb 17, 2012 3:03 PM IST

రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి కథానాయకుడిగా వస్తున్న చిత్రం “ఏకవీర” మార్చ్ 2న విడుదల కానుంది. ఈరం (తెలుగు వైశాలి) తో బాగా ప్రాచుర్యం పొందిన ఈ కథానాయకుడు ఇప్పుడు ఈ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. “షాపింగ్ మాల్” చిత్రానికి దర్శకత్వం వహించిన వసంత బాలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి మరియు అర్చన కవి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దామోదర్ ప్రసాద్ 5 కలర్ మీడియా బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. 18వ శతాబ్దం లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని గండికోట, బొబ్బిలి ఫోర్ట్ ,హంపి మరియు తలకోనల లో చిత్రీకరించారు. ఈ చిత్రం తో కార్తిక్ సంగీత దర్శకుడిగా మారారు.

తాజా వార్తలు