యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘థగ్ లైఫ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తుండటంతో వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చారు.
థగ్ లైఫ్ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘జింగుచా’ను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో మణిరత్నం, ఏఆర్ రెహమాన్ కాంబోపై మరోసారి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గట్టుగానే ఈ ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ కూడా ఉండటంతో ఈ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్, అభిరామి, నాజర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
One BEAT
Two THUGS#ThugLife brings the real anthemA #ManiRatnam Film
An @arrahman Musical
Thuglife first single #Jinguchaa releasing on April 18 #JinguchaaApril18 #Jinguchaafirstsingle #ThuglifeFromJune5 #KamalHaasan… pic.twitter.com/IObQ36ZfRU
— Raaj Kamal Films International (@RKFI) April 16, 2025