‘ఉస్తాద్ భగత్ సింగ్’ సాంగ్ పై మాస్ ప్రొడ్యూసర్ లీక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. లేటెస్ట్ గానే మేకర్స్ ఒక పవర్ ప్యాకెడ్ క్లైమాక్స్ ని మేకర్ కంప్లీట్ చేశారు. అయితే ఈ సినిమాలో ఒక సాంగ్ పై మాత్రం మాస్ ప్రొడ్యూసర్ ఏ కే ఎన్ ఇచ్చిన లీక్ ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తుంది.

“కళ్ళ నిండా లైవ్ లో ఆయన డాన్స్ చూస్తే కడుపు నిండిన భావోద్వేగం. లిరిక్ బయటకి వచ్చిన రోజున సోషల్ మీడియా మొత్తం. ఆ రోజు మళ్ళీ మాట్లాడుకొందాం” అంటూ తన మార్క్ ఎలివేషన్ తో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్ కి పవన్ డాన్స్, హరీష్ టేకింగ్ ఏ లెవెల్లో ఉన్నాయి అనేది అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Exit mobile version