ప్రజలకి బాలయ్య హెచ్చరిక.. అసలేం జరిగిందంటే!

BalaKrishna

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా “అఖండ 2” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బిజీలో ఉన్న బాలయ్య నుంచి ఇపుడు ఒక ఊహించని ప్రకటన వచ్చింది. బాలయ్య సినిమాలు మాత్రమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తన బసవతారకం కాన్సర్ హాస్పిటల్ విషయంలో జరుగుతున్న ఓ ఫేక్ ప్రచారాన్ని బాలయ్య తిప్పికొట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే అసలేం జరిగిందంటే..

“బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్” పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు, మరియు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతిలేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రజలందరికి నేను స్పష్టంగా తెలియజేయదలచుకున్న విషయం.. ఈ ఈవెంట్ కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన, పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు.” అంటూ బాలయ్య హెచ్చరిక అని తన ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Exit mobile version