హాస్యమే ప్రధానంగా సాగిన 2011

హాస్యమే ప్రధానంగా సాగిన 2011

Published on Dec 29, 2011 6:32 PM IST

ఒకప్పుడు హాస్యం చిత్రం లో ఒక భాగం ల ఉండేది కాని ఇప్పుడు హాస్యమే ప్రధానం అయిపోయింది. టాలివుడ్ నిర్మాతలు కూడా హాస్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు వారి అంతిమ లక్ష్యం ధియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించడంగా అడుగులు వేస్తున్నారు. నవరసాలలో ఇప్పుడు హాస్యం రాజు అయిపోయింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు పరిశ్రమ లో హీరో లు ఉన్నారు. మొదటి వర్గానికి మహేష్ బాబు మరియు జూ.ఎన్ టి ఆర్ హాస్య చతురత కలిగిన కథానాయకులు దూకుడు మరియు బృందావనం చిత్రాలలో వాళ్ళ హాస్య చతురతతో ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గతం లో లాగా హాస్యాన్ని పండించలేదు. రెండవ వర్గానికి గాను రవితేజ తన అద్బుతమయిన టైమింగ్ తో హాస్యాన్ని పండిస్తున్నారు. ఇంకా తరువాతి వర్గానికి అల్లరి నరేష్ హాస్యాన్ని అందిస్తున్నారు కథ చర్చల్లో కూర్చున్నపుడు హీరోలు దర్శకులను పంచ్ లైన్ ల ను మరియు హాస్యాన్ని కథలో చేర్చమని అడుగుతున్నారు. ప్రజలు కూడా వాటి కోసమే ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు