దర్శకురాలిగా మారబోతున్న చిన్మయి ఘట్రాజు

దర్శకురాలిగా మారబోతున్న చిన్మయి ఘట్రాజు

Published on Apr 8, 2012 5:44 PM IST

చిన్మయి ఘట్రాజు,” లవ్లీ” చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నఈ భామ ఇప్పుడు దర్శకురాలిగా మారబోతుంది. ప్రస్తుతం ఒక చిత్ర కథనం సిద్దం చేసుకుంటున్న ఈమె అన్ని సరిగ్గా జరిగితే కొద్ది రోజుల్లో ఈ చిత్రం చిత్రీకరణ మొదలు పెట్టుకుంటుంది. ఈ చిత్రం చాలా వరకు హైదరాబాద్ మరియు లండన్ లలో చిత్రీకరిస్తారు. తెలుగు చిత్ర పరిశ్రమ లో చాలా మంది దర్శకురాళ్ళు ఉన్నా ఇలా 20లలో ఒక దర్శకురాలు రావటం ఇదే మొదటి సారి ఈ చిత్రం మొదలు కాకముందు ఈమె ఒక చిత్రం లో పాత్ర కోసం సంప్రదించబడింది. తెలుగు కుటుంభాల నేఫధ్యం లో నడిచే ఈ చిత్రం ఐ టి లో ఒతిదుల గురించి ఉండబోతుంది. డల్లాస్ కి చెందినా ఈ తెలుగు సుందరి గతేడాది ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో తెరకెక్కిన ఎల్ బి డబల్యు చిత్రంతో తెరకు పరిచయం అయ్యింది. ఎంపిక చేసుకున్న పాత్రలే చేస్తున్న ఈ నటి త్వరలో అన్ని మారిపోతుంది అని నమ్ముతుంది.

తాజా వార్తలు