పాత స్నేహాన్ని మరిచిపోని మోహన్ బాబు,బాలయ్య బాబు

పాత స్నేహాన్ని మరిచిపోని మోహన్ బాబు,బాలయ్య బాబు

Published on Apr 9, 2012 11:35 PM IST

మోహన్ బాబు మరియు బాల కృష్ణ చాలా కాలం నుండి మంచి స్నేహితులు ఎన్టీయార్ అంటే మోహన్ బాబుకి ఎంతటి అభిమానమో తెలిసన విషయమే. మంచు మనోజ్ కథానాయికగా నటిస్తున్న చిత్రం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రం లో బాల కృష్ణ నటిస్తున్నారు ఈ చిత్రాన్ని లక్ష్మి మంచు నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే బాల కృష్ణ మోహన్ బాబు ఇంటికి విచ్చేశారు. అయన మనవరాళ్ళు అరియాన మరియు వివియానలను చూసేందుకు వెళ్ళారు. ఈ విషయమై మోహన్ బాబు ట్విట్టర్ లో ఇలా చెప్పారు ” ఈరోజు అరి మరియు వివిలకు ప్రత్యేక అతిధులు వచ్చారు వారి చైనా తాత (నా తమ్ముడు బాలయ్య) వారని ఆశీర్వదించడానికి విచ్చేశారు తన భార్య వశున్ధరతో సహా వచ్చిన బాలయ్య పిల్లలని ఆశీర్వదించారు ఇంకా మా సోదరి నారా భువనేశ్వరి కూడా వారితో కలిసి వచ్చారు. నేను తాతయ్య అయితే ను చైనా తాతయ్యే కదా తమ్ముడు బాలయ్య మీ ప్రేమ మరియు ఆప్యాయతకు మా కృతజ్ఞతలు” అని అన్నారు. ఇలా ఇద్దరు గొప్ప నటులు ఇంతకాలం స్నేహాన్ని ఉంచుకోవటం చాలా ఆనందకరమయిన విషయం. వీరు ఇద్దరు కలిసి ఒక చిత్రం చేస్తే చూడటానికి మరింత బాగుంటుంది.

తాజా వార్తలు