చిత్రీకరణ తిరిగి మొదలుపెట్టుకున్న ఆటో నగర్ సూర్య

చిత్రీకరణ తిరిగి మొదలుపెట్టుకున్న ఆటో నగర్ సూర్య

Published on Apr 8, 2012 3:52 PM IST

నాగ చైతన్య రాబోతున్న చిత్రం “ఆటో నగర్ సూర్య” ఏప్రిల్ 12 నుండి తిరిగి చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. దర్శకుడు దేవ కట్ట ఈ విషయాన్ని దృవీకరిస్తూ ఈ చిత్ర చివరి షెడ్యూల్ మొదలు పెట్టుకోనుంది దీనితో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది అని తెలిపారు. ఇందులో సమంత ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. నాగ చైతన్యతో సమంతకి ఇది రెండవ చిత్రం గతంలో వీరు ఇరువురు కలిసి చేసిన “ఏ మాయ చేసావే” భారీ విజయం సాదించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ సినిమాటోగ్రాఫర్. అచ్చి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య శక్తివంతమయిన పాత్రలో కనిపించబోతున్నారు ఆటో మొబైల్ ఇండస్ట్రి నేఫధ్యంలో సాగే యాక్షన్ చిత్రంగా ఇది ఉండబోతుంది. ఈ చిత్రం ఈ వేసవికి విడుదల కానుంది.

తాజా వార్తలు