సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం లో కీలక పాత్రలో నటిస్తున్న అంజలి ప్రస్తుతం మరో మల్టీ స్టారర్ చిత్రంలో నటించబోతుంది. కోలివుడ్ సమాచారం ప్రకారం ఈ భామ డిల్లీ బెల్లీ తమిళ రిమేక్ లో నటించబోతుంది. ఈ చిత్రం లో ఆర్య,హన్సిక,అంజలి,సంతానం మరియు ప్రేమ్ గి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో అంజలి హిందీలో పూర్ణ జగన్నాథన్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం మాతృకలో ఇమ్రాన్ ఖాన్,షేనాజ్ మరియు పూర్ణ జగన్నాథ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. హన్సిక షేనాజ్ పాత్రలో ఎయిర్ హోస్టెస్ గా కనిపించనుంది. ఈ చిత్రం మే 7న చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. జర్నీ సినిమా తో మంచి పేరు తెచ్చుకున్న అంజలి తరువాత పలు పాత్రలు చేజిక్కించుకుంది సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు మరియు ఈ చిత్రం కాకుండా సుందర్ సి దర్శకత్వం లో రాబోతున్న కలక్కలపు చిత్రం లో కూడా అంజలి కనిపించబోతుంది. తెలుగు మరియు తమిళ పరిశ్రమలో స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ శివ నాగేశ్వర రావు దర్శకత్వం లో “ఫోటో” చిత్రం తో పరిచయం కావటం ఆసక్తి కరమయిన విషయం.