అలీ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత కమెడియన్ గా మారి ఇప్పటికీ ప్రేక్షకులని నవ్విస్తున్నాడు. అలీ ఒక్క కమెడియన్ గానే కాక తనకి తగ్గా కథలు వచ్చినప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అలీ హీరోగా ‘అలీబాబా 40దొంగలు’, ‘ఆలీబాబా అరడజన్ దొంగలు’ లాంటి సూపర్ హిట్ సినిమాల తరహాలో ‘ఆలీబాబా ఒక్కడే దొంగ’ సినిమా తెరకెక్కుతోంది. ఇది అలీ హీరోగా చేస్తున్న 50వ సినిమా కావడం విశేషం.
ఫణి ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బొడ్డెడ శివాజీ నిర్మిస్తున్నాడు. సూజావారుని కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆద్యంతం నవ్వించేలా ఉంటుందని ఈ చిత్ర టీం చెబుతోంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తయిన ఈ సినిమాలో ఇంకా పాటల చిత్రీకరణ మాత్రం మిగిలి ఉంది. ప్రస్తుతం ‘గణేశా గణేశా.. లక్కిచ్చే గణేశా’ పాటని సారధి స్టూడియోస్ లో చిత్రీకరిస్తున్నారు.