యాబై వసంతాలు పూర్తి చేసుకున్న నాగేశ్వర రావు గారి “ఆరాధన”

యాబై వసంతాలు పూర్తి చేసుకున్న నాగేశ్వర రావు గారి “ఆరాధన”

Published on Feb 16, 2012 8:20 PM IST

అక్కినేని నాగేశ్వర రావు మరియు సావిత్రి నటించిన “ఆరాధన” చిత్రం ఈరోజుతో యాబై వసంతాలు పూర్తి చేసుకుంది. ఉత్తం కుమార్ మరియు సుచిత్ర సేన్ ప్రధాన పాత్రలో వచ్చిన బెంగాలి చిత్రం “సాగరిక” ఈ చిత్రానికి మాతృక ఆ చిత్రానికి ఈ చిత్రానికి కథానాయకుడు అంధుడు అదొక్కటే పోలిక నాగేశ్వర రావు గారు బెంగాలి చిత్రం చూసాక మధుసూదన్ రావు గారి కథ విని చిత్రం ఒప్పుకున్నారు. ఈ చిత్రం మొదలు పెట్టాక బిఎన్ రెడ్డి గారు చిత్ర రషెస్ చూపించక నాగేశ్వర రావు గారు చిత్రం ఆపేయాలని అనుకున్నారు ఎందుకంటే తన అభిమాన నటుడిని ప్రేక్షకులు అందుడిగా చూస్తారో లేదో అని కాని ధైర్యం చేసి ఈ చిత్రం పూర్తి చేసారు విడుదల అయ్యాక ఈ చిత్రం సంచలన విజయం సాదించింది ఈ చిత్రానికి గాను నాగేశ్వర రావు గారు పారితోషకం కింద పాతిక వేలు తీసుకున్నారు. ఇదే కాకుండా ఈ చిత్రం లో మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. రేలంగి గారి “డింగు టక” అనే పదం బాగా ప్రాచుర్యం పొందింది. “నా హృదయం లో నిదురించే చెలి” అనే పాట ఇప్పటికి ఒక అద్బుతమే.

తాజా వార్తలు