నలుగురు అమ్మాయిల జీవితాల ఆధారంగా సినిమా

ఈ మధ్యనే బాలీవుడ్‌లో విడుదలయిన ‘డర్టీ పిక్చర్’, ‘హేట్ స్టోరీ’ చిత్రాలను పోలిన చిత్రం తెలుగు ఓ కూడా రాబోతుంది . కామ్నజఠ్మలాని, శ్వేతాబసుప్రసాద్, నిఖిత, భానుశ్రీమెహ్రా ప్రధాన పాత్రలలో కనిపించబోతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ఉదయ్‌కాంత్ ఈ చిత్రానికి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచాన్ చేశారు.దర్శకుల సంఘం అధ్యక్షులు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘నలుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథగా ఈ చిత్రం ఉండబోతుంది. ఇందులో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ చేస్తామని నిర్మాత తెలిపారు. మంచి పాత్రలో నటిస్తున్నందుకు ఈ నలుగురు కథానాయికలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Exit mobile version