సెప్టెంబర్ లో విడుదలవ్వబోతున్న ‘ఎంఎంఎస్’

సెప్టెంబర్ లో విడుదలవ్వబోతున్న ‘ఎంఎంఎస్’

Published on Jul 31, 2013 1:15 AM IST

MMS
ప్రిన్స్, రిచా పనై, సేతు మరియు దిషా పాండే ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘మనసా మాయ సేయకే’. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. పి. సురేష్ దర్శకుడు. ఫుల్ హౌస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జైసన్ పులికొట్టిల్ , విన్స్ మంగదన్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ను సెప్టెంబర్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రిన్స్ కు జంటగా దిషా పాండే నటిస్తుండగా రీచా పనై మరియు సేతు మరో జంటగా కనిపిస్తారు. ప్రిన్స్ ఇప్పటికే ‘నీకు నాకూ డాష్ డాష్’, ‘బస్ స్టాప్’ సినిమాలో నటించాడు. రిచా పనై అల్లరినరేష్ నటించిన ‘యముడికి మొగుడు’ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా ‘మనతిల్ మాయం సేధాయ్’ పేరుతొ తమిళంలో కుడా విడుదలకానుంది. మనికాంత్ కాద్రీ సంగీత దర్శకుడు. వెంకట హనుమ సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు