జనవరి మొదటి వారంలో మిర్చి ఆడియో?

జనవరి మొదటి వారంలో మిర్చి ఆడియో?

Published on Dec 22, 2012 9:22 AM IST

Mirchi-in-prabhas
ప్రభాస్ తరువాతి చిత్రం “మిర్చి” దాదాపుగా సిద్దమయిపోయింది. ఈ మధ్యనే ప్రధాన తారాగణం మీద కొన్ని సన్నివేశాలను బ్యాంకాక్ లో చిత్రీకరించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు ప్రభాస్ న్యూ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రస్తుతం అందరి కళ్ళు ఈ చిత్ర ఆడియో మీదనే ఉంది.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో జనవరి మొదటి వారంలో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికే ప్రధాన ఆకర్షణ కానుంది. అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయం కానున్నారు. వంశీ కృష్ణ మరియు ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని సంయుక్తంగా యు వి క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఈ చిత్రం 2013లో విడుదల కానుంది.

తాజా వార్తలు