ఫిబ్రవరి రెండవ వారంలో ‘మిర్చి’

Mirchiగుంటూరు మిరపకాయ్ లాంటి ఘాటైన హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ మిర్చి సినిమాని ఫిబ్రవరి రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటల్లో డార్లింగే, మిర్చి టైటిల్ సాంగ్, యాహూ యాహూ పాటలకి మాస్ ఆడియెన్స్ నుండి రెస్పాన్స్ వస్తుండగా, ఇదేదో బావుందే, పండగలా పాటలకి క్లాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మొదట సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్న ఈ సినిమాని సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవడం వల్ల ఈ సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రభాస్ సరసన అనుష్క, రిచా గంగోపాధ్యాయ కథానాయికలుగా నటించిన ఈ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేసాడు. ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

Exit mobile version