యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘మిర్చి’. 30 సెకన్లు నిడివి గల ఈ మూవీ తొలి టీజర్ ని ఆదివారం సాయంత్రం విడుదల చేసారు, ఈ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్లో ప్రభాస్ కొత్త లుక్ మరియు యూత్ ఫుల్ సన్నివేశాలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో దేవీ శ్రీ ప్రసాద్ – ప్రభాస్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘వర్షం’, ‘Mr.పర్ ఫెక్ట్’ సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా ఆడియో కూడా సూపర్బ్ గా ఉంటుందని అనుకుంటున్నారు. ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ సరసన అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రమోద్ ఉప్పలపాటి -వంశీ కృష్ణా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇచట మిర్చి ఫస్ట్ లుక్ టీసర్ గూర్చి క్లిక్ చేయండి