యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “మిర్చి” చిత్రం భారీ విడుదలకు సిద్దమయ్యింది. ఫిబ్రవరిలో రానున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ నెలాఖరిలోగా ఈ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకోనుంది. ఈ చిత్ర ఆడియో ఆల్బంకి మంచి స్పందన లభించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పల్నాడు నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. ప్రభాస్ సరసన అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రమోద్ మరియు వంశీ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.