యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్బ్ బుజినెస్ జరుపుకుంటోంది, అలాగే వీకెండ్ లో అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ప్రభాస్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్, ఈ సినిమా 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిన్నటి వరకూ ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే సుమారు 1.72 కోట్ల షేర్ సాధించింది.
అక్కడ లాంగ్ రన్లో ఈ సినిమా మొత్తంగా సుమారు 2.30 – 2.50 కోట్ల షేర్ సంపాదిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏరియాలో ప్రభాస్ తన ‘Mr పర్ఫెక్ట్’ సినిమాతో అత్యధికంగా 1.86 కోట్ల షేర్ సాదించాడు. అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా కొరటాల శివ డైరెక్టర్.