‘మిరాయ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!

Mirai

టాలీవుడ్ మొదటి సూపర్ హీరో తేజ సజ్జ సూపర్ యోధాగా మారిన లేటెస్ట్ చిత్రమే “మిరాయ్”. గట్టి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమాని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా ఈ సినిమా ఇపుడు ఒక ఊహించని టాక్ తో ఓపెనింగ్స్ ని అందుకుంటుంది. ఇలా తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ పాజిటివ్ నోట్ తో మొదలైన ఈ సినిమా డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఇపుడు తెలుస్తుంది.

దీని ప్రకారం ఈ సినిమాకి తేజ సజ్జ గత చిత్రం హను మాన్ డే 1 ఓపెనింగ్స్ రేంజ్ లో వచ్చే ఛాన్స్ ఉందట. అంటే డెఫినెట్ గా 20 కోట్ల దగ్గర గ్రాస్ ఈ సినిమాకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అలాగే నార్త్ లో ఏమాత్రం క్లిక్ అయినా కూడా ఈ నెంబర్ 20 కోట్లకి పైగానే వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాల్లో టాక్. సో మిరాయ్ డే 1 కి మాత్రం సాలిడ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు.

Exit mobile version