మిల్క్ బ్యూటీ తమన్నాకి సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. తమన్నా బ్యూటిఫుల్ లుక్, గ్లామరస్ కాస్ట్యూమ్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. తమన్నా సోషల్ మీడియాలోకి కాస్త నిదానంగా ఎంటర్ అయ్యింది. ఇటీవలే తమన్నా ట్విట్టర్ లో జాయిన్ అయ్యింది.
దానికన్నా కాస్త ఆలస్యంగా తమన్నా పేస్ బుక్ పేజిని భారీగా ప్లాన్ చేసి లాంచ్ చెయ్యడానికి సిద్దమవుతోంది. తమన్నా తన ఫేస్ బుక్ పేజ్ ని బాగా అరుదైన 11-12-13న అనగా ఈ రోజు ప్రారంభించనుంది. ఈ పేజ్ గురించి తమన్నాని అడిగితే ఈ ఫేస్ బుక్ పేజ్ లో తన కి సంబందించిన ప్రత్యేకమైన ఫోటోలు, అలాగే తన సినిమాలకు సంబందించిన విశేషాలను తెలియజేస్తానని చెప్పింది. ప్రస్తుతం తమన్నా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న ‘ఆగడు’ సినిమాలో బిజీగా ఉంది.