‘షాడో’ సినిమా లాంటి డిజాస్టర్ ను మనకు బహుమతిగా ఇచ్చిన మెహర్ రమేష్ గుర్తున్నాడా?? అతను మరోసారి మనముందుకు ఇంకొక సినిమాను తీసుకురానున్నాడు. తాజా కధనాల ప్రకారం మెహర్ రమేష్ తన కొత్త స్క్రిప్ట్ పనులలో పూర్తిగా నిమఘ్నమై హీరోను వెతికే పనిలో వున్నాడు
చతికలపడ్డ పరిస్థితుల నుండి సైతం కొంతమంది తేలికగా తెరుకోగలరు. “శక్తీ” వంటి ఫ్లాప్ తరువాత అతను మరో భారీ సినిమాను ఎవరూ ఊహించి వుండరు. కానీ ‘షాడో’ తీసి మనల్ని ఆశ్చర్యపరిచాడు. ‘షాడో’ ఫ్లాప్ అయిన కూడా ఆయనకు ఆఫర్లు వస్తాయేమో చూడాలి మరి. ఈ సినిమాకు సంబంధించిన త్వరలోనే తెలియజేస్తాం