ఆది శంకరాచార్య కోసం డబ్బింగ్ చెప్పిన మెగా స్టార్

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకి బ్రేక్ ఇచ్చిన తరువాత ఆయన ఫాన్స్ మాత్రం 150వ సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 150వ సినిమాలో నటించకపోయినా ఆయన అభిమానులకు ఒక శుభవార్త. చిరంజీవి ఒక సినిమా కోసం తన గాత్రాన్ని అందించారు. అక్కినేని నాగార్జున, మోహన్ బాబు అతిధి పాత్రల్లో నటిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం ఆది శంకరాచార్య కోసం ఆయన వాయిస్ ఓవర్ అందించారు. గ్లోబల్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై కౌశిక్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి జె.కె భారవి దర్శకుడు. నాగ శ్రీవాత్సవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మొత్తం 9 పాటలున్నాయి. నాగ బాబు, శ్రీహరి ఇతర అతిధి పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version