అన్నీ కుదిరాయి కానీ… శకునమే సరిగా లేదు..!

అన్నీ కుదిరాయి కానీ… శకునమే సరిగా లేదు..!

Published on Apr 12, 2020 6:01 PM IST

చిత్ర పరిశ్రమలో పాతుకుపోయిన హీరోలు,నిర్మాతలు, దర్శకుల కొడుకులు హీరోగా ఎంట్రీ ఇవ్వడం అనేది సర్వ సాధారణం. వీరిలో సక్సెస్ అయ్యేవారు చాల తక్కువమంది ఉంటారు. కానీ మెగా హీరోల పరిస్థితి వేరు, చిరంజీవి వేసిన పునాదిరాళ్లు ఆసరా చేసుకొని ఐదారుగురు హీరోలు స్టార్ లు గా ఎదిగారు. ఒకరిద్దరు మినహా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన అందరూ హీరోలుగా ఓ ఇమేజ్ సొంతం చేసుకొని వరుసగా సినిమాలు చేస్తున్నారు. కాగా మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తున్న మరో యంగ్ ఫెలో వైష్ణవ్ తేజ్.

చిరంజీవి మేనల్లుడు ధరమ్ తేజ్ తమ్ముడే ఈ వైష్ణవ్ తేజ్. ఆయన చేస్తున్న డెబ్యూ మూవీ ఉప్పెనకు మంచి కాంబినేషన్ అండ్ క్యాస్టింగ్ మరియు క్రూ సెట్ అయ్యారు. దేవిశ్రీ అందించిన సాంగ్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక రోల్ చేయడం మరొక ఆకర్షణ. అన్నిటికీ మించి హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కుర్రకారుకి తెగనచ్చాయి. అయితే అన్నీ బాగున్నా కరోనా కారణంగా ఈ మూవీ విడుదల వాయిదాపడింది. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా విడుదల హోల్డ్ లో పడింది. అన్నీ కుదిరాయి హిట్ గ్యారంటీ అనుకుంటున్న సమయంలో మెగా హీరో మొదటి చిత్రాన్ని కరోనా వచ్చి ఆపేసింది.

తాజా వార్తలు