పవన్ నుంచి ఈ అప్డేట్ కూడానా?

పవన్ నుంచి ఈ అప్డేట్ కూడానా?

Published on Sep 2, 2020 8:00 AM IST

ఈరోజు పవన్ పుట్టినరోజు కావడంతో ఎప్పటిలానే ఒకరోజు ముందు గానే సోషల్ మీడియాలో ట్రెండ్ ను స్టార్ట్ చేసారు. కానీ కొంతమంది పవన్ అభిమానులకు మరియు వారి కుటుంబాలకు తీరని లోటు జరగడంతో పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. దీనితో పవన్ పవన్ అభిమానులు కూడా తమ ట్రెండ్ ను నిలిపేశారు. కానీ ఈరోజు పవన్ సినిమాలకు సంబంధించి మూడు అప్డేట్స్ రానున్నాయి.

తాను ఇప్పటికే నటిస్తున్న రెండు చిత్రాలతో సహా హరీష్ తో నటించనున్న మూడో చిత్రం అప్డేట్స్ రావడం ఖరారు అయ్యాయి. అయితే వీటితో పాటుగా పవన్ నటించబోయే మరో ప్రాజెక్ట్ కు సంబంధించి కూడా ఏమన్నా అప్డేట్ రానుంది అని టాక్ వినిపిస్తుంది. అదే తన 29వ చిత్రం దర్శకుడు సురేందర్ రెడ్డితో తెరకెక్కించనుంది అని టాక్. మరి ఇప్పుడేమో పరిస్థితులు తారుమారయ్యాయి. మరి ఈ చిత్రం అప్డేట్ కూడా వస్తుందో లేదో చూడాలి.

తాజా వార్తలు