ఆ స్టార్ హీరో దీపావళి సెంటిమెంట్ ఫాలో అవుతాడా?

ఆ స్టార్ హీరో దీపావళి సెంటిమెంట్ ఫాలో అవుతాడా?

Published on May 19, 2020 4:09 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ గత ఏడాది బిగిల్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. దీపావళి కానుకగా వచ్చిన స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ బిగిల్ రికార్డు కల్లెక్షన్స్ అందుకుంది. ఫుట్ బాల్ ప్లేయర్, కోచ్ మరియు మాస్ రౌడీగా భిన్న పాత్రలో కనిపించి అలరించాడు విజయ్. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన బిగిల్ విజయ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. తెలుగులో విజిల్ గా విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా విశేష ఆదరణ దక్కించుకోవడం గమనార్హం.

కాగా ఈ ఏడాది కూడా విజయ్ దీపావళి సీజన్ పైనే కన్నేశాడని తెలుస్తుంది. ఆయన లేటెస్ట్ మూవీ మాస్టర్ దీపావళి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. నిజానికి ఈ మూవీ గత నెలలోనే విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. మరో ప్రక్క ఓ టి టి లో విడుదల అవుతుందని ప్రచారం జరుగుతుండగా, ఖండించిన చిత్ర యూనిట్ దీపావళి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రధాన విలన్ గా విజయ్ సేతుపతి నటించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు