కాంతార అయిపోయింది.. ఇక ప్రశాంత్ వర్మకే ఫిక్స్..!

కాంతార అయిపోయింది.. ఇక ప్రశాంత్ వర్మకే ఫిక్స్..!

Published on Oct 17, 2025 6:03 PM IST

కన్నడ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తన ప్రెస్టీజీయస్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’తో బాక్సాఫీస్ దగ్గర థండరింగ్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్, దర్శకుడిగా ఆయన డెడికేషన్‌ను అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనుల నుంచి ప్రస్తుతం ఆయన ఫ్రీ అయ్యారు.

దీంతో రిషబ్ శెట్టి తన పూర్తి ఫోకస్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ కోసం పెట్టనున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘హను-మాన్’ బ్లా్క్‌బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ అనే సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు. అయితే, ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటించబోతున్నాడు.

దీనికోసం ఆయన పెద్ద మొత్తంలో డేట్స్ కేటాయించాడు. ఇక ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ప్రశాంత్ ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాడట. మరి ఈ సినిమాను ప్రశాంత్ వర్మ ఎంత సమయంలో పూర్తి చేస్తాడో చూడాలి.

తాజా వార్తలు