హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జటాధర’ కోసం ప్రేక్షకుల్లో ఒకింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం సూపర్ న్యాచురల్ అంశాలతో మెస్మరైజ్ చేస్తోంది. దెయ్యాలను వేటాడే హీరో.. అతని చుట్టూ జరిగే ధనపిశాచి ఆట.. ఈ క్రమంలో చోటు చేసుకునే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమా కథగా మన ముందుకు రాబోతుంది. ఇక ఈ ట్రైలర్‌లోని గ్రాఫిక్స్, విజువల్స్ సూపర్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా సరికొత్త పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమైంది.
ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ సినిమాకు రాజీవ్ రాజ్ బీజీఎం వర్క్ ప్లస్ పాయింట్ కానున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఇలాంటి థ్రిల్లింగ్ సూపర్ న్యాచురల్ కథతో వస్తున్న సుధీర్ బాబు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి