బాలయ్య పై కాంతార కన్ను..?

బాలయ్య పై కాంతార కన్ను..?

Published on Oct 17, 2025 7:00 PM IST

Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రెస్టీజియస్ ‘అఖండ 2’ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి బాలయ్య తాండవం చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే, బాలయ్య తన నెక్స్ట్ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు.

దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య గతంలో ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో సినిమా రానున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో ప్రముఖ కన్నడ డీఓపి అరవింద్ కశ్యప్ వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అరవింద్ కశ్యప్ కన్నడలో 777 ఛార్లీ, కాంతార వంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు.

ఇప్పుడు బాలయ్య సినిమాకు ఆయన సినిమాటోగ్రఫీ అందించనుండటంతో ఈ సినిమాలో ఎలాంటి విజువల్స్ ఉండబోతున్నాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ప్రొడ్యూస్ చేయనున్నారు.

తాజా వార్తలు