విక్టరీ వెంకటేష్ – ఎనర్జిటిక్ హీరో రామ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘మసాల’. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఆడియోని నిన్న సాయంత్రం సింపుల్ గా ఫంక్షన్ చేసి రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమానికి వెంకటేష్, రామ్, అంజలి, సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్, విజయ భాస్కర్, అలీ, పోసాని తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ ‘ వినోదం కలగలిపిన కుటుంబకథా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల తర్వాత మరోసారి విజయభాస్కర్ తో సినిమా చెయ్యడం ఆనదంగా ఉంది. రామ్ ఈ మూవీలో ఒక చాలెంజింగ్ రోల్ చేసాడు. అతని కెరీర్లో ది బెస్ట్ గా చెప్పుకునే సినిమా ఇదవుతుంది. మసాలా అందరూ చూడదగిన చక్కని కుటుంబకథా చిత్రం అని’ ఆయన అన్నారు.
రామ్, అంజలి, మిగిలిన ప్రముఖులు ఈ సినిమా చేయడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ మూవీలో వెంకీ సరసన అంజలి, రామ్ సరసన షాజన్ పదమ్సీ హీరోయిన్స్ గా కనిపించనున్నారు.