సుధీర్ బాబును మెప్పించిన మారుతి

సుధీర్ బాబును మెప్పించిన మారుతి

Published on May 27, 2013 8:10 PM IST

Prema-Katha-Chitram
సుధీర్ బాబు నటిస్తున్న ‘ప్రేమ కధా చిత్రమ్’ సినిమా మారుతీ ప్రణాళిక ద్వారా అద్బుతంగా తీర్చిదిద్ధబడుతుంది. ఈ సినిమా మారుతి పర్యవేక్షణలో జే. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు వెల్లడిస్తూ సుధీర్ బాబు ఈ విధంగా ట్వీట్ చేసాడు “ఈ సినిమాలో ప్రతీ సన్నివేశాన్ని ఒక వరుస క్రమంలో చిత్రీకరించాం. అంతే మొదట సీన్ మొదట షాట్ లో , రెండో సీన్ రెండో షాట్ లో తీసాము…. చిత్రంలో చాలా భాగం ఫార్మ్ హౌస్ లోనే తీసాం. మారుతి ఆ లొకేషన్ కు వెళ్ళే దారిలోనే డైలాగ్స్ రాసాడని”చెప్పాడు.
మామూలుగా ఏ దర్శకుడూ వరుస క్రమాన్ని పాటించారు. ఈ విధంగా తెరకెక్కించాలంటే స్క్రిప్ట్ చాలా పకడ్బందిగా రాయాలి. కాబట్టి మారుతీ, ప్రభాకర్ రెడ్డి ప్లానింగ్ చుసిన సుధీర్ బాబు మెప్పించడం అతిశయోక్తి కాదు. జె.బి సంగీతం అందించిన ఈ సినిమాలో నందిత హీరొయిన్. జూన్ 7న ఈ సినిమా విడుదలకు సిద్దంగా వుంది

తాజా వార్తలు