మారుతికి ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ స్థానమే ఉంది. అతనితో సినిమాలు చేస్తే పెట్టిన డబ్బులకు డోకా లేదని నిర్మాతల నమ్మకం. కానీ అతను తీసే సినిమాలలో బూతు పాళ్ళు కాస్త ఎక్కువగా వుండడంతో తనకి బూతు దర్శకుడు అన్న ముద్రపడిపోయింది
ఇప్పుడు ఆ ఇమేజ్ నుండి బయటకు రావడానికి మారుతి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఎటువంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా అల్లు శిరీష్ తో కలిసి ‘కొత్త జంట’ సినిమా తీస్తున్నాడు. అంతేకాదు వెంకటేష్ తో తీయబోయే ‘రాధా’ చిత్రం అసలు తన పంధాకే భిన్నంగా ఉంటుందని చెప్పుకొస్తున్నాడు
సో మారుతి ఈ కొత్త దారిలో పయనించి ఇక్కడ కుడా హిట్ కొడతాడా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే వరకూ వేచి చూడాల్సిందే