నా సినిమాఫై రూమర్స్ సృష్టిస్తున్నారు

నా సినిమాఫై రూమర్స్ సృష్టిస్తున్నారు

Published on Nov 18, 2012 2:45 PM IST


100 సినిమాలకు పైగా నటించినా ఇండస్ట్రీలో అందరితోనూ ఎంతో స్నేహంగా ఉంటూ, తన పని ఏంటో తను చూసుకునే ఫ్యామిలీ హీరో శ్రీ కాంత్. అలాంటి శ్రీ కాంత్ ద్వి పాత్రాభినయం చేసిన సినిమా ‘దేవరాయ’. ఈ సినిమాలో శ్రీ కాంత్ ఆంధ్రభోజ శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో శ్రీ కాంత్ మాట్లాడుతూ ‘ కొంతమంది ‘దేవరాయ’ సినిమాని విడుదల కాకుండా ఆపాలని ప్రయత్నిస్తున్నారు. సినిమాలో వల్గారిటీ ఎక్కువగా ఉందని సినిమాపై లేని పోని చెడు రూమర్స్ క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఇందులో నేను చేసిన దొరబాబు పాత్ర చాలా సరదాగా ఉంటుంది అంతేకానీ ఆ పాత్రలో ఎలాంటి వల్గారిటీ ఉండదు. మీకందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది మరియు నేను చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న బెస్ట్ సినిమా ఇదని’ అన్నాడు. మీనాక్షి దీక్షిత్ మరియు విదిష హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని నాని కృష్ణ డైరెక్ట్ చేసారు. ఈ సినిమాని నవంబర్ 23న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు