నేపధ్య సంగీతానికి బాగా పేరున్న స్వర బ్రహ్మ మణిశర్మ ఒంగోలు గిత్తకి కూడా నేపధ్య సంగీతం అందిస్తున్నాడు. రామ్, కృతి ఖర్బంధ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా నేపధ్య సంగీత భాధ్యతలు మాత్రం మణిశర్మకి అప్పగించారు. ప్రేమించుకుందాం రా, లక్ష్మి, చింతకాయల రవి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓ మై ఫ్రెండ్ ఇటీవలే విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకి మణిశర్మ నేపధ్య సంగీతం అందించాడు. అలాగే ఈ సినిమాకి నేపధ్య సంగీతంతో పాటుగా ఒక పాట కూడా కంపోజ్ చేసాడు మణి. ఈ చిత్ర పాటలు ఈ రోజు సాయంత్రం అన్నపూర్ణ స్టుడియోలో విడుదల కానున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్, మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన పరుగు సినిమా వర్క్ నచ్చి ఈ సినిమాకి మణిశర్మని కోరుకున్నట్లున్నాడు భాస్కర్.