బాలీవుడ్ కధనాల ప్రకారం నిర్మాత ఏక్తా కపూర్ మణిరత్నం తియ్యనున్న హిందీ సినిమాకు సహ నిర్మాణం చేయ్యనున్నాడట. ఇది నిజంగా విచిత్రమనే చెప్పాలి ఎందుకంటే ఏక్తా సినిమాలకూ,మణి సినిమాలకూ అసల పొంతనే ఉండదు. ఈమధ్య ఏక్తా కపూర్ కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, విక్రమాదిత్య మొత్వనే వంటి పేరున్న దర్శకులతో తీసి హిట్లు కొడతున్నాడు. ఇప్పుడు అతని దృష్టిలోకి మణిరత్నం వచ్చాడు.
‘కడలి’ వంటి ఫ్లాప్ తరువాత మణి సార్ ఈసారి ఒక ప్రేమ కధను తెరకెక్కించనున్నారు. ఇది జాతి వివక్షల నడుమ సాగే కధ. ఈ కధకు సంబందించిన స్క్రిప్ట్ పనులను మణిరత్నం రెన్సిల్ డి సిల్వాకు అప్పగించాడు. ఈ స్క్రిప్ట్ పనులు పుర్తయ్యాకే మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఏ.అర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశాలు వున్నాయి.