మంచు విష్ణు హీరోగా వస్తోన్న కొత్త సినిమా ‘మోసగాళ్లు’. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఈ సినిమా ఛేదిస్తుంది. అయితే ఈ మధ్య హాట్ లేక డీలా పడ్డ మంచు విష్ణుకు ఈ సినిమా హిట్ ను ఇస్తోందా ? చూడాలి. సినిమా అయితే చాల బాగా వచ్చిందని తెలుస్తోంది. ఇక మంచు విష్ణు మంచి బిజినెస్ మెన్ కూడా. ముఖ్యంగా కథలను కూడా బాగా జడ్జ్ చేస్తారు. కాగా ఈ సినిమాలో రోబరికి సంబంధించి ఓ సీక్వెన్స్ అదిరిపోతుందట. పైగా యూనివర్సల్ స్టోరీతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది.
ఇక హాలీవుడ్ లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అక్కడ బాగా ఆకట్టుకుంటుందని, ఇక తెలుగు వర్షన్ లో కొన్ని మార్పులు చేశారట. కాగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు.