మంచు విష్ణు సెన్సేషనల్ కాంబో సెట్టయ్యింది!

మంచు విష్ణు సెన్సేషనల్ కాంబో సెట్టయ్యింది!

Published on Nov 20, 2020 2:59 PM IST

మన టాలీవుడ్ లో కొన్ని బెంచ్ మార్క్ సెట్ చేసిన కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో మంచు కుటుంబం నుంచి వచ్చిన హీరో మంచు విష్ణు మరియు ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రెస్ అయినటువంటి శ్రీను వైట్ల కాంబో కూడా ఒకటి. వీరిద్దరి కాంబోలో వచ్చిన “ఢీ” సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్.

ఆ సినిమాలో ఉండే ఎంటర్టైన్మెంట్ కు ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉంది. దీనితో ఈ సెన్సేషనల్ కాంబోపై మంచి క్రేజ్ వచ్చింది. అక్కడ నుంచి వీరి కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అంతా ఎదురు చూస్తున్నారు కూడా. అలాగే టాక్ కూడా వినిపించింది. కానీ ఇప్పుడు ఫైనల్ గా 13 ఏళ్ళు తర్వాత మళ్ళీ వీరి కాంబో నుంచి ఓ సినిమా వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.

ఈసారి మాత్రం వీరి కాంబో నుంచి రాబోయే రెండో సినిమా క్రేజీ అప్డేట్ వచ్చే నవంబర్ 23న ఉండనున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ క్రేజీ అప్డేట్ ఏంటా అని చర్చ స్టార్ట్ అయ్యింది. మరి ఈసారి వీరి నుంచి ఎలాంటి ఎంటర్టైనర్ వస్తుందో చూడాలి. ఆల్రెడీ ఓసారి ట్రెండ్ సెట్ చేసారు కాబట్టి శ్రీను వైట్ల మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.

తాజా వార్తలు