ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవి ప్రొడక్షన్స్ పతాకాలపై రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఓ.. చెలియా’. ఈ సినిమాకు కథ, కథనం, దర్శకత్వం ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి చేపట్టగా, నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు జోరుగా ప్రారంభమయ్యాయి. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్‌ను లాంచ్ చేశారు.
‘నువ్వే చెప్పు చిరుగాలి’ అనే ఈ మెలోడీ సాంగ్‌ను సాయి చరణ్ పాడగా ఎంఎం.కుమార్ స్వరాలు అందించారు. సుధీర్ బగడి రాసిన సాహిత్యం ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఉంది. విడుదల చేసిన లిరికల్ వీడియో చూస్తే, ఇది ఒక అందమైన ప్రేమకథా చిత్రమని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా హీరో–హీరోయిన్ల కెమిస్ట్రీ కొత్తదనాన్ని పంచి ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించబోతోందని చెప్పొచ్చు.
టెక్నికల్ విభాగంలో సురేష్ బాలా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఉపేంద్ర ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.