
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన మీసాల పిల్ల సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక నెక్స్ట్ సాంగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఒక కూల్ పోస్టర్ తో దీనిపై అప్డేట్ ఇచ్చేసారు.
చిరంజీవి నయనతార లు మంచి స్టైలిష్ అండ్ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్ తో మరో చార్ట్ బస్టర్ గ్యారెంటీ అనిపిస్తుంది. ఇక ఈ సాంగ్ అనుకున్నట్టుగానే శశిరేఖ అనే పేరిటే వస్తుంది. మరి భీమ్స్ ఈసారి ఎలాంటి ట్యూన్ అందించాడో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 8 వరకు ఆగాల్సిందే. ఇక దీనికి సమయం ఆ ముందు రోజు రివీల్ కానుంది. ఈ చిత్రానికి షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తుండగా విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర ఇందులో పోషిస్తున్నారు.

